Breaking News

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ .. మంత్రి కేటీఆర్

10 th Jan 2022, UTC

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని . ఎన్డీఏ అంటే నో డేటా ఆవేలేబుల్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు ద్వారా రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదు ఒక సాహసం అన్నారు. వ్యవసాయ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం అని ఆయన అన్నారు, రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్టులు రాష్ట్రానికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని  ఆయన మండిపడ్డారు.ఉమ్మడి రాష్ట్రంలో ఊర్లకు ఊర్లె వల్లకాడు గా మారాయని కేటీఆర్ అన్నారు. ఉద్యమం లో రైతుల దుస్థితి చూసి కేసీఆర్ చలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. అపుడు కరెంటు లేదు.. పెట్టుబడి సాయం లేదు. పంట దిగుబడులు లేవని అన్నారు. వలసల దుస్థితి అంతరించిందని, రైతుల దర్జా పెరిగిందని అన్నారు. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ట్రైనీ ఐఎస్ లకు పాఠ్యంశాలు గా మారాయని చెప్పారు. కోటి ఎకరాల మాగాణే కాదు. ముక్కోటి టన్నుల ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు.  ఎఫ్ సి ఐ  గోడౌన్ల లో పట్టనంత ధాన్యం తెలంగాణ నుంచి వస్తోంది నిజం కాదా? అని ప్రశ్నించారు.  వ్యవసాయానికి కేసీఆర్ ఇచ్చిన ఊతమే రైతు జీవితాలను మార్చింది నిజం కాదా? రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్ల లో పడటం లేదా? కావాలంటే తన దగ్గర రికార్డులు ఉన్నాయన్నారు.

వేరే రాష్ట్రాలు కూడా రైతు బంధు ను అనుసరిస్తున్నాయని, 50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరిందన్నారు. ఆసరా పెన్షన్ల ను విమర్శించే రాజకీయ నాయకుల తల్లి దండ్రులు దాన్ని తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశాము. మిగతాది దశల వారీ గా చేస్తాంఅన్నారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణాల మాఫీ చేస్తామన్నా ప్రజలు నమ్మలేదని.. అందుకే తమకే రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. రైతు బీమా రైతు కు రక్షణ కవచంగా మారిందన్నా మంత్రి కేటీఆర్. రైతు బీమాతో కేసీఆర్ రైతులకు అన్నగా మారారన్నారు. రైతు బీమా కు రూ.3205 కోట్ల మేర ప్రీమియం కట్టామన్నారు. 70 వేల మంది రైతులకు రైతు బీమాతో ప్రయోజనం జరిగింది. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని మరో ప్రశ్న వేశారు. కేంద్రం నుంచి అరపైసా సాయం లేకున్నా కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం అన్నారు. 70 యేండ్ల లో ఇంత త్వరితగతిన ప్రాజెక్టు కట్టిన సందర్భం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

జాతీయ పార్టీ లకు మమ్మల్ని విమర్శించే మొహం ఉందా? ఎక్కడైనా ఇంత వేగం గా ప్రాజెక్టు కట్టారా? అని విమర్శించారు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లు కేసీఆర్ కు రెండు కండ్లు అని చెప్పుకొచ్చారు. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయితే కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు ఊపిరి అన్నారు. పాలమూరు కొందరు దుర్మార్గుల కోర్టు కేసులతో కొంత ఆలస్యం అవుతోందని.. అయినా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు బీడు భూములకు ఖిల్లాగా ఉండేది. ఇపుడు చేపల చెరువులకు అడ్డాగా మారిందన్నారు. కేసీఆర్ వ్యవసాయానికి దిక్సూచి గా మారారు. నదులకు నడక నేర్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.లక్ష రైతు కల్లాలు ఏర్పాటు చేశామన్నారు. మండు వేసవి లోనూ తెలంగాణలో చెరువులు  మత్తడ్లు  దుంకుతున్నాయని,..తెలంగాణలో హార్వెస్టర్ల, ట్రాక్టర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పారు. ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందని.. అవి సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం,శ్వేత విప్లవం, నీలి విప్లవం అని.. వీటిని గట్టిగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox