Breaking News

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ విధానం ప్రమాదకరం..: కేసిఆర్

15 th Sep 2020, UTC

హైదరాబాద్ :కేంద్రం ప్రభుత్వం ఇటీవల కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విద్యుత్ విధానం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. దీని గురించి మాట్లాడిన కేసిఆర్ "కొత్త విద్యుత్ చట్టం ప్రకారం మీటర్లకు రీడింగులు పెట్టాల్సి వస్తుందన్నారు. మీటర్లు, రీడింగ్ లు పెట్టి రైతుల వద్ద నుంచి తప్పనిసరిగా బిల్లులు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితి ని కేంద్రమే తీసుకొస్తోందన్నారు. దీని వలన రైతులు ఇబ్బందులు పడతారని, కేంద్రం ప్రతిపాదించిన ఈ కొత్త కరెంటు చట్టం రాష్ట్రానికి తీవ్ర నష్టాలను తీసుకొస్తుందని" కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేసారు.

ఈ కొత్త చట్టం వలన రాష్ట్రములో కరెంట్ వ్యవస్థలు నాశనం అవుతాయని అన్నారు. ఉత్తరాదిలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేసే కరెంటును కొనుగోలు చేయడం కోసం, ఈ కొత్త చట్టాలని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపణ చేసారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే, రాష్ట్రాల్లో ఉండే లోడ్ డిస్పాచ్ సెంటర్లు ఎగిరిపోతాయని, అపుడు ప్రతి దానికి ఢిల్లీ వారిపై ఆధారపడాల్సి వస్తుందని కేసిఆర్ అన్నారు. ఇప్పటికే, కేంద్రం నూతన కరెంట్ చట్టం తాలూకు ముసాయిదాను పంపిందని, దీనిని డిస్కంలకు పంపమని తెలిపారు. దీనిపై ఇప్పటికే చర్చలు జరిగాయని అన్నారు. పార్లమెంట్ లో కూడా ఈ విషయమై చర్చ జరగనుందని అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox