Breaking News

టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం కనిపిస్తోంది.. కేంద్రమంత్రి స్మతి ఇరానీ 

25 th Nov 2020, UTC

న్యూఢిల్లీ :టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తూనే ఉందని, అందుకే బీజేపీ కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని కేంద్రమంత్రి స్మతి ఇరానీ మండిపడ్డారు. బుధవారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలపై అధికార టీఆర్‌ఎస్ అక్రమ కేసులు బనాయిస్తోందని, దుబ్బాకలో కూడా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై సర్జికల్‌ స్ట్రైక్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య రాష్ట్రం పరిధిలోని అంశమని, తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ వలసదారులకు ఓటు హక్కు తొలగించాలని డిమాండ్‌ చేశారు.

పాతబస్తీలో రోహింగ్యాలకు ప్రభుత్వం ఓటు హక్కు కల్పించిందని ఆరోపించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు కల్పించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దాదాపు 75 వేల మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్‌ నగరంలో ఎలా నివసిస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ చొరబాటు దారుల నుంచి దేశాన్ని బీజేపీ కాపాడుతుందని స్పష్టం చేశారు. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌తో బీజేపీ ముందుకెళ్తోందని స్మృతి ఇరానీ తెలిపారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox