Breaking News

ఊరు పొమ్మంటోంది.. కొత్వాల్ గూడ గ్రామస్తులకు కేంద్రం షాక్

18 th Oct 2021, UTC

వారందరూ తరతరాలుగా అక్కడే నివసిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూములను సాగుచేసుకుని బ్రతుకుతున్న వారు కొంతమంది. జీవనోపాధికోసం  ఏదో ఒక పనిచేసుకుని బ్రతుకుతున్న వారు మరికొంతమంది. ఇపుడు వీరందరి నెత్తిమీద పిడుగు పడ్టట్లయింది. ఎందుకంటే వారు నివసిస్తున్న గ్రామాన్ని ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనిమీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. వారు ఎవరోకాదు..రంగారెడ్డి  జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామస్తులు. ఇలా చడీ చప్పుడూ లేకుండా అకస్మాత్తుగా తమను ఊరు విడిచి వెళ్లాలని కోరడం ఏమిటో అంతుచిక్కక వారందరూ ఆందోళనకు గురవుతున్నారు.   ఒకటీ రెండూ కాదు ఏకంగా 657 ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ ప్రాంతం అంతా తమదే అంటూ కేంద్రప్రభుత్వం చెప్పడం వారిని షాక్ కు గురిచేసింది. 

ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్  అంటే ఏమిటి? 

1965 మరియు 1971 లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధాల తరువాత  భారతదేశం నుండి పాకిస్తాన్‌కు  పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వచ్చారు. .ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, 1968 అనేది భారతదేశ పార్లమెంటు చట్టం, ఇది భారతదేశంలోపాకిస్తాన్ జాతీయుల   ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత ఈ చట్టం ఆమోదించబడింది.  కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన ఎనిమీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా కు సంరక్షకణ బాధ్యత ఇవ్వబడింది. 2017 లో ఈ చట్టానికి సవరణ చేసారు. దీని ప్రకారం పాకిస్తాన్ మరియు చైనాకు వలస వచ్చిన వారి వారసులు భారతదేశంలో మిగిలిపోయిన ఆస్తులపై క్లెయిమ్ చేయడానికి వీలుపడదు. 2018 లో, మోదీ ప్రభుత్వం శత్రు ఆస్తులను అమ్మడానికి  ఎనిమీ ప్రాపర్టీ ఆర్డర్ కింద మార్గదర్శకాలను జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వాలు శత్రువుల ఆస్తులను "ప్రత్యేకంగా ప్రజల ఉపయోగం కోసం" ఉపయోగించుకునే అధికారం కలిగి ఉన్నాయి. మార్చి 2019 లో, కేంద్రం కొన్ని  ఎనిమీ ప్రాపర్టీస్ ను "ప్రజా వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించింది.కొత్వాల్ గూడను పరిపాలించిన సయ్యద్ హసన్ అనే జాగీర్దారుకు చెందిన భూములు ఇక్కడ ప్రజలు కొనుగోలు చేసారు. అయితే హసన్ తరువాత అతని వారసుడు పాకిస్తాన్ కు వలస పోవడంతో ఈ భూములు ఎనిమీ ప్రాపర్టీస్ కింద చేరిపోయాయి. అందువలన వీటిపై కేంద్రప్రభుత్వానిదే పెత్తనం. మరి దీనిపై ఇప్పటికే గ్రామస్తులు స్దానిక ప్రజాప్రతినిధికి, అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఎనిమీ ప్రాపర్టీపై కోర్టుకు వెళ్లవచ్చా?

హజ్రత్‌గంజ్, సీతాపూర్ మరియు నైనిటాల్‌లో అనేక ఆస్తులను కలిగి ఉన్న మహమూదాబాద్ రాజా ఎస్టేట్ విషయంలో సుప్రీంకోర్టు ఒక ప్రధాన తీర్పు వెలువరించింది. విభజన తరువాత, రాజా ఇరాక్ వెళ్లి అక్కడ కొన్నాళ్ళు ఉండి లండన్‌లో స్థిరపడ్డారు. అయితే అతని భార్య మరియు కుమారుడు మహ్మద్ అమీర్ మొహమ్మద్ ఖాన్ భారత పౌరులుగా ఉన్నారు.1968 లో భారత ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట  అమలు చేసిన తరువాత, రాజా ఎస్టేట్ శత్రు ఆస్తిగా ప్రకటించబడింది.అయితే రాజా మరణించాక , అతని కుమారుడు ఆస్తిపై క్లెయిమ్ చేశాడు. 30 సంవత్సరాల పాటు జరిగిన న్యాయ పోరాటం తర్వాత, జస్టిస్ అశోక్ భాన్ మరియు జస్టిస్ అల్తామాస్ కబీర్‌లతో కూడిన అత్యున్నత ధర్మాసనం అక్టోబర్ 21, 2005 న కుమారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.  పాకిస్తాన్‌కు వలస వచ్చిన వ్యక్తుల నిజమైన లేదా ఉద్దేశించిన బంధువులు తాము శత్రు ఆస్తుల యొక్క నిజమైన యజమానులుగా పేర్కొంటూ  గిఫ్ట్ డీడ్స్ సమర్పించారు. జూలై 2, 2010 న, అప్పటి యుపిఎ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది, ఇది కస్టోడియన్ నుండి శత్రువుల ఆస్తులను విడదీయాలని ప్రభుత్వాన్ని ఆదేశించకుండా కోర్టులను నిరోధించింది.  దీనితో 2005  సుప్రీంకోర్టు ఉత్తర్వు చెల్లకుండా పోయింది. కస్టోడియన్  మరలా రాజా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఎనిమీ ప్రాపర్టీస్ విలువ లక్షకోట్లు

దేశంలో మొత్తం 9,280  ఎనిమీ ప్రాపర్టీస్ ను  పాకిస్థాన్ జాతీయులు, చైనీస్ జాతీయులు వదిలేశారని వీటి విలువ మొత్తం విలువ సుమారు రూ.లక్ష కోట్లు వుంటుందని తెలుస్తోంది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం  ఈ ఆస్తులను అమ్మడానికి చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.కేంద్ర ప్రభుత్వం యొక్క ముందస్తు ఆమోదంతో  కస్టోడియన్ , చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా తనకు అప్పగించిన శత్రువుల ఆస్తులను అమ్మడానికి అవకాశముంది.

ప్రభుత్వం ఏం చేస్తుంది?

మరి కొత్వాల్ గూడ విషయంలో ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది? ఇంతమంది ప్రజలను, వారి ఉపాధిని దెబ్బతీయడానికి సిద్దమవుతుందా?లేక  ప్రజాప్రయోజనాల పేరిట కొంత భూమిని తీసుకుని వదిలేస్తుందా?   అన్నది చూడాలి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox