Breaking News

దరణి పోర్టల్ తో రైతుల పరిస్దితి దయనీయం.. ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి

05 th Oct 2021, UTC

ధరణి పోర్టల్   రైతాంగం యొక్క పాత సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెచ్చి పెట్టిందని... కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయినట్లుగా పరిస్థితి తయారయ్యిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. అన్నదాతల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎంపీ  కోమటిరెడ్డి లేఖ రాశారు. 

తరతరాలుగా భూ వివాదాలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ధరణి పోర్టల్ ను అమల్లోకి తెచ్చింది.  అయితే సమస్యల పరిష్కారం అటుంచి అన్నదాతల భూ వివాదాలను మరింత క్లిష్టతరం చేసింది. ఇలా ధరణి అభాసుపాలవుతోంది'' అని పేర్కొన్నారు.  ధరణి పోర్టల్ ను అమల్లోకి తెచ్చి దాదాపుగా 11 నెలలు కావస్తోంది. ఈ 11 నెలల్లో ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చబడ్డ భూములను తొలగించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య సుమారుగా లక్ష వరకు ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో  రైతుల నుంచి అర్జీలు వచ్చినా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమేరకు దృష్టిసారించిందో అర్థం కావడంలేదన్నారు. 

2007 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్  చట్టంలోని సెక్షన్ ౼ 22A లో నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చింది. 2007 నుండి ఇప్పటివరకు రకరకాల కారణాలతో దాదాపు 20 లక్షల ఎకరాల పట్టభూమిని నిక్షిప్తం చేసింది. వివాదరహితంగా ఉన్నటువంటి పట్టా భూములకు సంబంధించిన కొన్ని వేల సర్వే నెంబర్లను కూడా రిజిస్ట్రేషన్ శాఖ తీవ్ర నిర్లక్ష్యంతో సెక్షన్ ౼ 22A లో చేర్చింది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రిజిస్ట్రేషన్ చట్టం లోని సెక్షన్ ౼ 22A ను అప్ డేట్ చెయ్యాలి. అలా చేస్తే ధరణి ద్వారా పుట్టుకొచ్చిన అనేక కొత్త సమస్యలలో దాదాపు 50% సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉన్నదని భూ చట్టాల నిపుణులు, రైతుల తరపున అవిశ్రాంతంగా పోరాడుతున్న ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారని కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox