Breaking News

బాటసింగారానికి తరలిన గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్

16 th Oct 2021, UTC

పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని గడ్డిఅన్నారం నుంచి పండ్ల మార్కెట్ ను బాటసింగారానికి తరలించినట్లు మంత్రి సబితా  ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు కమీషన్‌ ఏజెంట్లు సహకరించాలని ఆమె  కోరారు.  బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌‌ను  శుక్రవారం మంత్రి సబిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వ్యాపారులంతా సహకరిస్తే వీలైనంత త్వరలోనే కొహెడలో శాశ్వత ప్రాతిపదికన అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ నిర్మాణం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. అప్పటి వరకు పండ్ల క్రయ, విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సబిత హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగించేందుకు సిద్ధమని   అనుమానం, అపోహలకు గురికావొద్దని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం ఉంటుందని ఆమె చెప్పారు. 

గడ్డి అన్నారం  ఫ్రూట్ మార్కెట్‌‌ను బాట సింగారానికి తరలింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్  స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ  ఫ్రూట్ మార్కెట్‌ను బాటసింగారం గ్రామ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం  నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజంట్స్ అసోసియేషన్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై    తెలంగాణ హైకోర్టు  విచారించింది. అనంతరం ఈనెల 18వ తేదీ వరకు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై  దసరా సెలవుల తర్వాత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.

హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రస్తుతమున్న ఆసుపత్రులతో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రలను నిర్మించనుంది.ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం స్థలాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox