Breaking News

తెలంగాణ లో పదవతరగతి పరీక్షలు రద్దు..!

08 th Jun 2020, UTC
తెలంగాణ లో పదవతరగతి పరీక్షలు రద్దు..!
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యం లో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ పదవతరగతి పరీక్షలను రద్దు చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరో వైపు. కేంద్రం సడలింపులు అనుమతులు ఇస్తుండడం తో.. కేసులు పెరుగుతూ పోతున్నాయి.. కేవలం పదిహేను రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. దేశ ఆర్థికపరిస్థితి దృష్ట్యా పూర్తిగా లాక్ డౌన్ పెట్టే అవకాశం కనపడటం లేదు. ఇప్పటికే రెండు నెలల లాక్ డౌన్ తో దేశ ఆర్ధిక పరిస్థితిపై పెను ప్రమాదం చోటుచేసుకుంది.
 
             ఈ నేపధ్యం లో లాక్ డౌన్ ఆంక్షలను సడలించక తప్పడం లేదు. అయితే.. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాల్సిందే. ఇది ఇలా ఉంటె.. ఈ పరీక్షలు నిర్వహించే విషయమై తెలంగాణ ప్రభుత్వం.. షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై హై కోర్ట్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పరీక్షలకు హై కోర్ట్ అనుమతించలేదు. అయితే.. ఈ రెండు జిల్లాలోనూ పరీక్షలు అనుమతించాలని కోరినప్పటికీ హై కోర్ట్ ఒప్పుకోలేదు. ఏ ఒక్క విద్యార్థి కి కరోనా సోకి మరణించినా... బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించింది.
 
             దీనితో.. ఈ జిల్లాలు మినహా.. ఇతర ప్రాంతాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనబడకపోవడం తో..తొలుత ఈ పరీక్షలు వాయిదా వేసింది. కానీ.. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం.. మరోవైపు.. విద్యార్థుల తల్లి తండ్రులలోను భయం నెలకొని ఉండడం తో.. ఈ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox