Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వేల టెన్షన్

12 th Jan 2022, UTC
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వేల టెన్షన్

 trsmlas: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు టెన్షన్ ఎందుకు పట్టుకుంది?... ఎన్నికలకు రెండేళ్లున్నా... ఇప్పటి నుంచే వారిలో అలజడికి కారణమేంటి?...  ఎమ్మెల్యేల పనితీరుపై గులాబీ బాస్ కేసీఆర్ చేయిస్తున్న సర్వేలే కారణమా?... ఇప్పటి నుంచి చేయిస్తోన్న సర్వేలు వచ్చే ఎన్నికల్లో టికెట్లను డిసైడ్ చేస్తాయన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోందా? అసలు టిఆర్ఎస్‌లో ఏం జరుగుతుంది?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ..  ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న అంశంపై అంతర్గత  సర్వేలు చేస్తున్నారట... వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమున్న పలువురు ఎమ్మేల్యేలపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్న దానిపై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారట ... ఇప్పుడీ ఈ అంశమే కారు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది... దీంతో ఎమ్మేల్యేలకు తెగ టెన్షన్   పట్టుకుందట.2018 ముందస్తు ఎన్నికల్లో ఐదుగురు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇచ్చారు కేసీఆర్... సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చిన ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.. అదలా ఉంటే గ్రేటర్  ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది... సర్వేల్లో వచ్చిన ఫలితాలను పక్కపెట్టి మెజారిటీ సిట్టింగ్ కార్పోరేటర్లకు ఎన్నికల్లో సీట్లు ఇచ్చారు... ప్రజలలో కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత తో చాలా మంది ఓడిపోయారు... గ్రేటర్ ఎన్నికల్లో చేసిన తప్పు మళ్ళీ చేస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని గులాబీ బాస్ భావిస్తున్నారట. అందుకే సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో పరిస్థితిని ఇప్పటి నుంచి అంచనా వేస్తున్నారట..

ప్రస్తుతం టీఆర్ఎస్ శాసనసభ్యుల్లో 68 మంది రెండుసార్లు...అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచినవాళ్ళే... అయితే  వరుసగా గెలుస్తూ వస్తోన్న కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే అభిప్రాయంతో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది... 2014 లో టీఆర్ఎస్ ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ ఇమేజ్ తోనే అధికారంలోకి వచ్చింది... ఇక రెండోసారి కూడా కేసీఆర్ తో పాటు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల బేస్ గా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి... అటు కాంగ్రెస్, బీజేపీలు బలంగా టిఆర్ఎస్ ను ఢీ కొడుతున్నాయి. .. ఆ క్రమంలో స్థానికంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే అది ప్రతిపక్షాలకు ప్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట... అందుకే ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.... దీంతో ఈ సర్వేలు ఎమ్మెల్యేల్లో అలజడి రేపుతున్నాయట.ఓవైపు బీజేపీ,  కాంగ్రెస్ దూకుడుగా రాజకీయాలు చేస్తున్నాయి ... దీంతో గులాబీ బాస్ కేసీఆర్ ... దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు భవిష్యత్తులో ఎదురుకాకుండా జాగ్రత్తలు పడుతున్నారట... ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని ... వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది... ఈ ఎఫెక్ట్‌తో ఓవరాల్‌గా ఎంత మంది సిట్టింగులు సీట్లు గల్లంతవుతాయో చూడాలి.

మరిన్ని రాజకీయ వార్తలు  చదవండి

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox