Breaking News

పండగ వేళ.. ఆర్టీసీ రోడ్డెక్కేనా..?

19 th Oct 2020, UTC
పండగ వేళ.. ఆర్టీసీ రోడ్డెక్కేనా..?

హైదరాబాద్ :రాష్ట్రంలో పండగ సందడి తక్కువగానే కనిపిస్తోంది. ఓ వైపు కరోనా మరో వైపు వరదలు దీనితో సందడి కొంత తగ్గిందనే అనిపిస్తోంది. అయితే కరోనా కారణంగా డిపోలకే కూలపడ్డ బస్సులు రోడ్లెక్కుతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపబోతోంది. అయితే. ఈ బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లవు. కేవలం తెలంగాణ పరిధిలోనే తిరుగుతాయి.
 
ఈనెల 22 నుంచి 24 మధ్య 2వేల 34 సర్వీసులను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఆర్టీసీ అధికారులు ముందుగానే రిజర్వేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. ఈ నెల 16 నుంచి ఏపీఎస్ఆర్టిసి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఈ నెల 26 వరకు మొత్తం 1850 బస్సులను అదనంగా నడపనుంది. ఎపి నుంచి బెంగళూరుకు ప్రత్యేకంగా 562 బస్సులను నడపనుంది. అయితే కరోనా బెడద ఎక్కువగా ఉండడంతో తమిళనాడు సరిహద్దు వరకే నడుపుతున్నారు. ఇటు తెలంగాణతోఇంకా చర్చలు పూర్తి కాకపోవడంతో తెలంగాణకు మాత్రం ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox