Breaking News

హోం క్వారంటైన్ లో మంత్రి హరీష్ రావు..!

13 th Jun 2020, UTC
హోం క్వారంటైన్ లో  మంత్రి హరీష్ రావు..!

తెలంగాణలో ప్రతీ రోజు కరోనా కేసులు నమోదవుతున్నాయి.ముఖ్యంగా లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత  కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇంకా కరోనా పరీక్షలు ఆశించిన సంఖ్యలో జరగడం లేదని అవి జరిగితే ఇంకా కేసుల సంఖ్య పెరుగుతుందని  అంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు కరోనా భయం వెంటాడుతోంది. ఎందుకుంటే ప్రతిరోజూ వారు ప్రజలను, ఉద్యోగులను కలుస్తుంటారు. పలు సమస్యలపైన సమీక్షలు జరుపుతారు. సమావేశాలకు హాజరవుతుంటారు. వీటికి వచ్చిన వారిలో ఎవరు వైరస్ తో  వున్నారో తెలియని స్దితి. దీనితో ఏ మాత్రం కరోనా లక్షణాలు కనపడినా క్వారంటైన్ లోకి వెడుతున్నారు.

. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గతరెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ముత్తిరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు వైరస్‌ సోకడంతో ఆయన వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన సమీప వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

మరోవైపు  మంత్రి హరీష్‌ రావు సమీప వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారుల్లో కొంతమంది వైరస్‌ సోకడంతో ఎంపీ ముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారెంటైన్‌కు వెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరోవైపు జీహెచ్‌ఎంసీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. నేడు మరోసారి మేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మరికొందరు రాజకీయ ప్రముఖులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్‌ పయనమైనట్లు సమాచారం.

ఇక భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా కలెక్టర్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. దీంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అంతా అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ కార్యాలయంలోని పలువురు అధికారులు, వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బంది, రాజకీయ నాయకులు.. ఒక్క శుక్రవారం రోజే మొత్తం 34 మంది తమ గొంతు స్రావాలను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పరీక్షలకు ఇచ్చారు. మొత్తంమీద సామాన్యులనే కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు సైతం కరోనా ఎఫెక్ట్ తప్పడం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox