Breaking News

మున్సిపాలిటీల్లో కారు జోరు

03 rd May 2021, UTC
మున్సిపాలిటీల్లో కారు జోరు

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో విజయాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రసమితి మున్సిపాలిటీ ఫ‌లితాల్లోనూ అదే దూకుడు కొన‌సాగించింది. జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పూర్తి స్థాయి మెజార్టీని సాధించింది 

అచ్చంపేట మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల‌ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్ 23 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ రెండు, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరుమున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను 7 వార్డుల‌ను టీఆర్ఎస్ గెలుచుకుంది. న‌కిరేక‌ల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డుల‌కు గాను 11 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox