Breaking News

తెలంగాణ ఐటీ హబ్ సూపర్ ఐటీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసలు

08 th Sep 2021, UTC
తెలంగాణ ఐటీ హబ్ సూపర్     ఐటీ స్టాండింగ్‌ కమిటీ  ప్రశంసలు

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఏ‍ర్పాటు చేసిన తెలంగాణ  ఐటీ హబ్‌ని పార్లమెంట్‌ ఐటీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్‌ నేతృత్వంలోని  పార్లమెంటు ఐటీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్‌ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్‌లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. 

తెలంగాణ ఐటీ హబ్‌ పనితీరును పశ్చిమ బెంగాల్‌కి చెందిన టీఎంసీ ఎంపీ, మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్‌ సెంటర్‌ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్‌లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్‌ చేశారు. అంతేకాదు వండర్‌ఫుల్‌ జాబ్‌ ఆల్‌ అరౌండ్‌ కేటీఆర్‌టీఆర్‌ఎస్‌ అంటూ ప్రశంసించారు. తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్‌ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్‌ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్‌ చేశారు. టీ  హబ్‌ ఈజ్‌ వెరీ ఇంప్రెసివ్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ ఇన్షియేటివ్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్ లకు ఇంక్యుబేటర్ గా  టీ-హబ్ నవంబర్ 5 న హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా ప్రారంభం అయింది.. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీలతో పాటు మరి కొన్ని కంపెనీల సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.  టీ హబ్‌లో జీ+5 ఫ్లోర్‌లలో దాదాపు 100 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్ భవనాన్ని నిర్మించారు. తెలంగాణ ఐటీ హబ్ సూపర్ ఐటీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసలు

08 th Sep 2021, UTC
తెలంగాణ ఐటీ హబ్ సూపర్     ఐటీ స్టాండింగ్‌ కమిటీ  ప్రశంసలు

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఏ‍ర్పాటు చేసిన తెలంగాణ  ఐటీ హబ్‌ని పార్లమెంట్‌ ఐటీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్‌ నేతృత్వంలోని  పార్లమెంటు ఐటీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్‌ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్‌లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. 

తెలంగాణ ఐటీ హబ్‌ పనితీరును పశ్చిమ బెంగాల్‌కి చెందిన టీఎంసీ ఎంపీ, మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్‌ సెంటర్‌ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్‌లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్‌ చేశారు. అంతేకాదు వండర్‌ఫుల్‌ జాబ్‌ ఆల్‌ అరౌండ్‌ కేటీఆర్‌టీఆర్‌ఎస్‌ అంటూ ప్రశంసించారు. తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్‌ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్‌ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్‌ చేశారు. టీ  హబ్‌ ఈజ్‌ వెరీ ఇంప్రెసివ్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ ఇన్షియేటివ్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్ లకు ఇంక్యుబేటర్ గా  టీ-హబ్ నవంబర్ 5 న హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా ప్రారంభం అయింది.. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీలతో పాటు మరి కొన్ని కంపెనీల సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.  టీ హబ్‌లో జీ+5 ఫ్లోర్‌లలో దాదాపు 100 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్ భవనాన్ని నిర్మించారు.   • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox