Breaking News

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల రేపేనా..?

15 th Jun 2020, UTC
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల రేపేనా..?
ఎట్టకేలకు ఇంటర్ విద్యార్థుల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల విద్యార్థుల వాల్యూషన్ ప్రక్రియ పూర్తి అవడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారో అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
 
              ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. జూన్ 16న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఒకవేళ వీలుకాకపోతే జూన్ 17న ఖచ్చితంగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుతు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.
 
               నేడు, తెలంగాణ ఇంటర్‌ బోర్డు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఆమోదం తీసుకోనున్నారు. మంత్రి ఆమోదం పొందిన తర్వాత 16న లేదా 17వ తేదీలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఒకేరోజున రెండు సంవత్సరాల ఫలితాలు విడుదల అవనున్నాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox