Breaking News

తెలంగాణ లో కొత్త సచివాలయం..!

07 th Jul 2020, UTC
తెలంగాణ లో కొత్త సచివాలయం..!
                తెలంగాణ లో ఇప్పటి వరకు సచివాలయం గా కొనసాగిన బీఆర్కే భవన్‌ను క్లోజ్ చేసేసారు. మంగళవారం.. ఈ సచివాలయ కూల్చివేత పనులను ప్రారంభించారు. ఈరోజు ఉదయమే... పాత  సచివాలయ కూల్చివేత ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రభుత్వ అధికారులు.. జేసీబీ సాయం తో భవనాన్ని కూల్చివేస్తున్నారు..  ఆ దారుల్లో ఎవరు రాకుండా.. సచివాలయం వైపు రహదారుల్ని కూడా మూసివేశారు.
 
               ఆ ప్రాంతం వైపు ఎవరు రాకుండా.. భారీ బందోబస్తు ను కూడా ఏర్పాటు చేసారు. ఎవరూ రావొద్దని సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు చేశారు. మరోవైపు కూల్చివేత పనులను సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం.. అధికారుల సమక్షం లో సి బ్లాక్ ను కూల్చివేస్తున్నారు.. ప్రభుత్వ నియమాలను పాటిస్తూనే.. పనులు ప్రారంభించారు.
 
               ఇది ఇలా ఉంటె.. మరో వైపు.. తెలంగాణ కొత్త సెక్రెటరియేట్ డిజైన్ ను కూడా ఖరారు చేసారు. అధికారికంగా సీఎంవో కార్యాలయం ఈ డిజైన్ ను విడుదల చేసింది. కొత్త సచివాలయ భవన సమూనా చారిత్రక కట్టడాన్ని పోలి ఉంది. ఈ సచివాలయ భవనాన్ని ఆరు అంతస్తుల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ శ్రావణ మాసం లో భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, పర్యావరణహిత భవన నిర్మాణంగా ఈ డిజైన్ ను తీర్చిదిద్దారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox