Breaking News

కేసీఆర్‌కు తొత్తులుగా ఉద్యోగ సంఘాల నాయకులు:బండి సంజయ్‌ కుమార్‌

06 th Jun 2020, UTC

కొందరు వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం దుర్మార్గమని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. వైన్స్‌ కోసం కూడా ప్రత్యేక జీవోలు జారీ చేయడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన ఘనత అని, ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం బండి సజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడం దురదృష్టకరం. సీనియర్ లెక్చరర్, ఎక్సైజ్ సీఐల ఎక్స్‌టెన్షన్‌లకు జీవోలు జారీ చేయడం ఏంటి?. రహస్యంగా జారీ చేసిన జీవోలకు లెక్క లేదు. జారీ చేయాలనుకుంటున్న వాటికి అంతులేదు.

ప్రభుత్వం చేస్తున్న ఈ మోసంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పునరాలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే డాక్టర్లకు కరోనా. బీజేపీ ఎంత చెప్పినా డాక్టర్లకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు పంపిణీ చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. వైద్యులను కాపాడలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఏమి కాపాడుతుంది?. మీకు చేతగాకపోతే చెప్పండి. కోవిడ్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లను మేమే కాపాడుకుంటాం. ప్రభుత్వ చేతగానితనం వల్లనే తెలంగాణలో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుంది’  అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్రంలో నియామకాలు లేవు. ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్‌కు తొత్తులుగా మారి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ల కుటుంబం కోసమే పదవీ విరమణ పెంపు జీవో తెప్పించారు కొందరు నేతలు. 50 శాతం జీతాలు కట్ చేసినా, ఐఆర్ ఇవ్వకపోయినా  ఈ నేతలు మాట్లాడరు. మీ స్వలాభం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు తాకట్టు పెట్టారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మీరంతా ఎక్కడికి వెళ్లారు. నేడు ఉద్యమకారులంతా కనుమరుగు అయ్యారు. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేందుకు అందరూ ముందుకు రావాలి. అని  ఆయన విజ్ఞప్తి చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox