Breaking News

బీజేపీలో చేరిన స్వామిగౌడ్ 

25 th Nov 2020, UTC
బీజేపీలో చేరిన స్వామిగౌడ్ 

ఢిల్లీ :శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న స్వామి గౌడ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి స్వామి గౌడ్‌ను జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు

బీజేపీలో చేరడం అంటే తన తల్లి గారి ఇంటికి వచ్చినట్లు భావిస్తున్నట్టు స్వామి గౌడ్‌ అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణ జెండా పట్టని వారికి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. మమ్మల్ని ఎండలో నిలబెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతో బీజేపీలో చేరాను. వందసార్లు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరాను. రెండేళ్లలో నాకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మాభిమానం కాపాడుకునేందుకే బీజేపీలోకి వచ్చాను. టీర్‌ఆర్‌ఎస్‌లో చాలామంది అవమానాలకు గురవుతున్నారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుంది. హైదరాబాద్ మేయర్ సీటు బీజేపీ గెలుస్తుందని అన్నారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox