Breaking News

పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

24 th Nov 2020, UTC

హైదరాబాద్ :పాతబస్తీ ప్రాంతంలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగానే పాతబస్తీపై సర్టికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. 

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంటే నీ పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. సర్జికల్ స్ట్రైక్ అంటే ఎవర్నో చంపేందుకు కాదు. అక్రమంగా ఉంటున్న వారి ఓట్లతో గెలుస్తున్నందున వారిని వెళ్లగొట్టాలి. రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమి తరిమి కొడతాం అని అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బండి సంజయ్ మతిస్తిమితం లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని ఆ పార్టీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కొన్ని ఓట్లు, సీట్ల కోసం బండి సంజయ్ ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox