Breaking News

కేసీఆర్ బర్త్ డే కోసం రూ.500 కోట్టు ఖర్చు చేసారు.. నిజామాబాద్ ఎంపీ అరవింద్

21 st Feb 2021, UTC

కేసీఆర్ జన్మదినం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేశారని  నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆరోపించారు.మొక్కల పేరుతో నిధులు మింగేసేందుకు ఇలా చేసారని ఆయన విమర్శించారు.. రోహింగ్యాలను ప్రభుత్వ, పోలీస్ పెద్దలే ప్రోత్సహిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాల సమస్య దేశానికి అతిపెద్ద సమస్యగా పరిణమించిందని  అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రసులో పాస్ పోర్టులు జారీ చేస్తున్నారన్నారు. రోహింగ్యాలు దేశ భద్రతకే సవాల్‌గా మారారన్నారు. మయన్మార్‌లో వందల మంది హిందువులను హతమార్చారన్నారు. ఐరిష్, బయోమెట్రిక్ లేకుండానే ఆధార్ కార్డులను సంపాదిస్తున్నారన్నారు. ముస్లింలు జనాభాలో మాత్రమే పెరిగారు తప్ప.. జీవన ప్రమాణాలు కాదన్నారు. 

భారత్‌లో మాత్రమే ముస్లింలకు భద్రత ఉందన్నారు. దేశద్రోహులతో కొట్లాడే ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు.  ట్విట్టర్ పిట్ట కేటీఆర్.. రోహింగ్యాలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.హోంమంత్రి మహమూద్ అలీకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బఫూన్లు పాలిస్తున్నారని.. కేసీఆర్, కేటీఆర్ తోలుతీస్తామని మాట్లాడుతున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పౌరుషం రావడం లేదన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox