Breaking News

ఏం కాలం సార్ ఇది.. కూరగాయాల్నీ కొట్టేసారు.. వాపోతున్న సాఫ్ట్ వేర్ శారద..!

31 st Jul 2020, UTC

హైదరాబాద్ : కలికాలమే కష్టకాలం అనుకుంటే,దీనికి తోడు కరోనా వచ్చింది. దుర్భరమైన బతుకుల్ని మరింత దుర్భరంగా మార్చింది. ఈ గడ్డుకాలంలో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మార్కెట్ కుదేలైపోవడంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనితో ఉద్యోగం కోల్పోయినవారు మరో ఉద్యోగం కోసం వేట మొదలెడుతున్నారు.

       కరోనా గడ్డుకాలం లో ఉద్యోగం దొరకటం కూడా కష్టంగా మారిపోయింది. ఓ అమ్మాయి సాఫ్ట్ వెర్ శారద లాక్ డౌన్ వల్ల ఉద్యోగంపోయి,కూరగాయాలు విక్రయిస్తూ కుటుంబం నడుపుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమె గురించి వార్తలు రావడంతో దేశమంతా ఆమెను అభినందిస్తోంది. కుంగుబాటుకు లోను కాకుండా, ధైర్యంగా కుటుంబాన్ని ముందుకు నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆమె తెగువ నచ్చి సోనుసూద్ కూడా ఆమె కు ఉద్యోగం ఇప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మంచి రోజులొస్తున్నాయని సంబరపడే లోపే, ఆమె అమ్మకానికి పెట్టుకున్న కూరలను ఎవరో కేటుగాళ్లు కొట్టేశారు.

          కుటుంబాన్ని నడుపుకోవడం కోసమే కూరలమ్ముకుంటున్నానని, ఆ కూరలు కూడా దొంగతనంకి గురి అవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శారద శ్రీనగర్ కాలనీ ఫుట్‌పాత్‌పై కూరగాయాలు అమ్ముతున్నారు. రోజులానే మంగళవారం రాత్రి కూడా అమ్మేసి, ఇంటికెళ్లిపోయారు. కానీ మరునాడు వచ్చి చూస్తే తన కూరగాయాలు లేవు. రోజు లాగానే విజిటేబుల్స్ విక్రయించిన తర్వాత కవర్ కప్పి వెళతానని ఆమె చెబుతున్నారు. కానీ తిరిగి వచ్చి చూసేసరికి కూరలు లేవని ఆమె వాపోయారు. వాటి విలువ ఐదువేల రూపాయలని చెప్పారు. ఉద్యోగం పోవడంతో,కూరలమ్ముకుని బతుకుతున్నామని, వాటిని కూడా దొంగిలించడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox