Breaking News

దళిత రైతు ఆత్మహత్యతో కేసీఆర్ ఇలాకాలో పొలిటికల్ హీట్

31 st Jul 2020, UTC

 సిద్దిపేట : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో రైతు వేదిక నిర్మాణం కోసం భూమిని ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారంటూ నర్సింహులు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

నర్సింహులు బలవన్మరణానికి పాల్పడే ముందు సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నాడు. తనకున్న 13 గుంటల భూమిని రైతు వేదిక కోసం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అతడు ఆరోపించాడు. అందుకే ఆ భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల్లోకి ఎక్కించడం లేదన్నారు. సర్పంచ్, పట్వారీ, ఎమ్మార్వో వల్లే తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానని అతడు ఆరోపించారు. తన 13 గుంటల పొలం పట్టా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. తాతలు సంపాదించిన నాకు దక్కకుండా చేస్తున్నారని వాపోయాడు.

నర్సింహులు సిద్ధిపేట హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా,తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ,మృతుడి కుటుంబ సభ్యులు సర్పంచ్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ సర్కారు వైఖరి వల్లే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడని విపక్షాలు ఆరోపిస్తున్నారు. రైతుది ఆత్మహత్య కాదు హత్యేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ ఘటనపై పార్టీ నేతలతో నిజనిర్ధారణ కమిటీ వేశారు.

రెవెన్యూ అధికారుల ఒత్తిడితోనే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. సర్పంచ్ ఇంటిముందు బైఠాయించారు. ఘటనకు బాధ్యులైనవారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతు మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు సిద్ధపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోతే ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox