Breaking News

అఖిల ప్రియకు మరోసారి చుక్కెదురు..!

18 th Jan 2021, UTC
అఖిల ప్రియకు మరోసారి చుక్కెదురు..!

బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారం కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికందరాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ను కోరుతూ అఖిల ప్రియ వేసిన పిటిషన్ ను గతంలో కోర్ట్ తిరస్కరించిన సంగతి విదితమే. తాజాగా, మరో సారి అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అఖిల ప్రియ పై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేయడంతో బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ) కేసును కూడా పోలీసులు నమోదు చేసారు. 

అయితే, ఈ కేసులకు జీవితకాల శిక్ష పడే అవకాశం ఉందని, ఇలాంటి కేసులు తమ పరిధిలోకి రావని సికందరాబాద్ కోర్టు పేర్కొంది. దీనితో, బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో అఖిల ప్రియ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ప్రధాన నిందితురాలుగా ఉన్న అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా కొందరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వీరికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox