Breaking News

కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి... రేవంత్ రెడ్డి

07 th Jun 2020, UTC
కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి... రేవంత్ రెడ్డి

కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని ఆరోపించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని, తన భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని తెలిపారు. కేటీఆర్‌ 111 జీవోను ఉల్లంఘించడంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్లామని చెప్పారు.

 8 మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని తెలిపారు. 301, 302 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణికి భూమి ఉందని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అర్బణా వెంచర్స్‌కు కూడా అక్కడ భూమి ఉందని, అందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఉందని తెలిపారు. ఆ భూములు లీజుకు తీసుకుంటే అఫిడవిట్‌లో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. ఎవరి దగ్గర లీజుకు ఎవరి దగ్గర లీజుకు తీసుకున్నారో, దాని యజమాని ఎవరో బయట పెట్టాలని, అక్కడ వారి భూములున్నట్లు తాను నిరూపిస్తానని, లేదంటే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ఏం నేరం చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డిని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారని  మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్, శంకర్‌పల్లి ప్రజలకో న్యాయం.. కేటీఆర్‌కో న్యాయమా? అని విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 111 జీవోకు విరుద్ధంగా ఉన్నాయని వేల ఇళ్లను కూల్చారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిర్మాణాన్ని మాత్రం వదిలేశారని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ నుంచి కేటీఆర్‌ను తప్పించాలని కాంగ్రెస్‌ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox