Breaking News

తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..!

14 th Sep 2020, UTC
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..!

హైదరాబాద్ :రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే, సెప్టెంబర్ 17వ తేదీ వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలంగాణలో హెచ్చు స్థాయి లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగానే భారీ స్థాయిలో వర్షం కురుస్తుందని తెలిపారు. ఇది  ఇలా ఉంటె, మరో వైపు  మధ్యస్థ ట్రోపోస్పియర్ లెవెల్ ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా భారీ గా వర్షాలు కురవడానికి కారణం అవుతుందన్నారు. తూర్పు విదర్భ, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది తెలంగాణ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. దీని వలన మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox