ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఈ సమావేశం పూర్తి అయిన తరువాత పివి కుమార్తె సురభి వాణీదేవికి సీఎం కేసీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఓడిపోయే టికెట్ ను పివి కుమార్తె కు ఇస్తారా? అంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ పివి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారన్నారు.
గవర్నర్ కోటాలో ఆమెను ఎమ్మెల్సీ చేయొచ్చు కదా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న కుట్రని పివి కుమార్తె తెలుసుకోవాలన్నారు. రాజకీయ స్వలాభం కోసమే పివి కుమార్తెకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపణలు గుప్పించారు. పివి నరసింహారావు పై ఉన్న గౌరవంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు బరినుంచి తప్పుకోవాలంటూ మంత్రి తలసాని సూచిస్తున్నారన్నారు.
పివి పై అంత గౌరవమే ఉంటె పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవికి రాజ్యసభ సీటు కానీ, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇవచ్చని అభిప్రాయపడ్డారు. గెలవడానికి వీలుపడని స్థానాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని అవమానించేలా చేయొద్దంటూ హితవు పలికారు. మరో వైపు బీజేపీ నేతలు కూడా సురభి వాణీ దేవిని ఎమ్మెల్సీ పోరులో నిలబెట్టి బలిపశువును చేస్తున్నారని దుయ్యబట్టారు. మరిన్ని వార్తలు చదవండి

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021