Breaking News

కేటీఆర్, హరీశ్ 100 శాతం నిజాయితీపరులు.. పోసాని మురళీ కృష్ణ

07 th Jun 2020, UTC

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిపై సినీ నటుడు పోసాని మురళీ కృష్ణతీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రూ.50లక్షలు లంచం ఇస్తూ కళ్లముందు కనపడ్డ వ్యక్తి రేవంత్ అని, జైలుకెళ్లిన వ్యక్తని ఆరోపించారు. అలాంటి వ్యక్తి కేటీఆర్‌ను అవినీతి పరుడు అనడం బాధాకరమన్నారు. మంచి నాయకులపై బురద జల్లడం సరికాదన్నారు. ఎవరు మంచివాళ్లో తనకు తెలుసని.. కేటీఆర్, హరీశ్ 100 శాతం నిజాయితీపరులన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు రెండు కళ్లలాంటి వాళ్లన్నారు.

కేసీఆర్ నోట్లోనుంచి ఊడిపడ్డ వ్యక్తి కేటీఆర్ అని, కేసీఆర్ లాగే మంచి వక్త అన్నారు. పోలీసులు, రాజకీయ వ్యవస్థల మధ్య ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి అని, వాటిని అధ్యయనం చేశారన్నారు. కేటీఆర్ చేసిన అవినీతి గురించి నిరూపిస్తే... తన మాటలు వెనక్కి తీసుకుంటానన్నారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశారని, అంత గొప్ప ప్రాజెక్టుని ప్రతిపక్షం కూడా దాన్ని అభినందించాలన్నారు. తెలంగాణ వచ్చాక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని ఉత్తమ్, జానారెడ్డి లాంటి వాళ్లు ప్రశంసించాలన్నారు. ఇది కమిషన్ల కోసం అంటే తనలాంటి వాళ్లు బాధపడతారన్నారు. కాంగ్రెస్ హాయంలో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ కట్టారని, ప్రజలు, ప్రతిపక్షం అభినందించిందన్నారు. నాగార్జున సాగర్ కట్టింది కమిషన్ల కోసమే అంటే ఎబ్బెట్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ లాగే కేసీఆర్ కూడా కాళేశ్వరం కట్టారన్నారు.

. ప్రతిపక్షాలు ప్రజల మధ్య ఉండాలని, మీడియా మధ్య కాదని హితవు పలికారు. ప్రజల మధ్యే ఉన్న వైఎస్ జగన్ దానికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రజల మనోభావాలు తెలుస్తాయన్నారు. ఉత్తకుమార్ నీతివంతమైన వ్యక్తి అని తెలుసని, ఆయన పక్కన ఉత్తమమైన రాజకీయాలు చేసేవాళ్లుంటే.. మంచి మాటలు వస్తాయన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox