Breaking News

ఐఎస్‌బీ కీలక మైలురాయిని దాటింది.. ప్రధాని మోదీ

26 th May 2022, UTC

Hyderabad: అభివృద్ధిలో భారత్ దూసుకెళ్లోందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ. విద్యార్థులకు మెడల్స్, పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ ఐఎస్‌బీ తన ప్రయాణంలో కీలక మైలురాయిని దాటిందన్నారు. ఐఎస్‌బీ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో మంది కృషి ఉందన్నారు. 

ఇక్కడి విద్యార్థులు ఎన్నో స్టార్టప్‌లు మొదలుపెట్టారని ఐఎస్‌బీలో చదివిన వారు విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని మోదీ అన్నారు. వచ్చే 25 ఏళ్లకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు.భారత్ జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తోందన్నారు. భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని, విద్య, వైద్య రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు.

జీ20 దేశాల్లో భారత్‌ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ దేశంలో ఉంది. కరోనా సమయంలో దేశం తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూపింది. యువతతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రిఫామ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ అందరికీ ముఖ్యం. దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం. మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించండని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox