హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరమని, ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలని.. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు.24 గంటలూ కరెంట్ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్ భగీరథను విజయవంతం చేశాం.. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ పథకాలు ఎక్కడా లేవని అన్నారు.కేసీఆర్ కిట్టు... సూపర్ హిట్టు అని కేసీఆర్ అన్నారు. ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అందించాం. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని, సెలూన్లకు ఉచిత విద్యుత్ అందించామని, దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. కరోనాతో 52 వేల కోట్ల ఆదాయం కోల్పోయినా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు.గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తామని, హైదరాబాద్‌కు అందమైన మూసీని అందించే బాధ్యత నాదని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ లో వరదలు వచ్చినపుడు ఇంటికి రూ.10వేల సహాయం అందించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నా. బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలించే ఏ నగరంలోనూ ఆర్థికసాయం అందించలేదు. అయినా కిరికిరి పెడుతున్నారు.. బాధతో ఈ మాట అంటున్నా. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10 వేల వరదసాయం అందిస్తామని కేసీఆర్ తెలిపారు.1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. 13పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. మేం భారతీయులం కాదా?.. భారతదేశంలో లేమా? అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న కేరళ, కర్ణాటకకు ఇచ్చారని ఆయన విమర్శించారు. వరద సాయం చేయకుండా కేంద్రమంత్రులు ఇప్పుడు వరదలా వస్తున్నారు. ఇవి స్థానిక ఎన్నికలా? జాతీయస్థాయి ఎన్నికలా? బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? అంటూ ప్రశ్నించారు.
యూపీ సీఎం ఇక్కడి వచ్చి ప్రచారం చేస్తున్నారు. 28 ర్యాంకులో ఉన్నాయన మనకేం చెబుతాడు. హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. బిపాస్ కావాలా?, కర్ఫ్యూ పాస్ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాలి. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలిపించి టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
23 Jan 2021
23 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021
24 Jan 2021