Breaking News

కారెక్కిన కౌశిక్ రెడ్డి

21 st Jul 2021, UTC
కారెక్కిన కౌశిక్ రెడ్డి

కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌ రెడ్డి బుధవారం సాయంత్రం టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్‌ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కౌశిక్‌ రెడ్డికి టీఆర్ఎస్‌లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన్ను ఎవడూ ఆపలేడని, ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.

కౌశిక్‌ రెడ్డి తండ్రి సాయినాథ్‌ రెడ్డి నాతో కలిసి పనిచేశారు. నాడు చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాసమితి పార్టీ అప్పట్లోనే 11 ఎంపీ సీట్లు గెలుచుకుంది. నేను ఎన్టీఆర్‌ అవకాశమిస్తే ఎమ్మెల్యే అయ్యాను.

ఎన్నో అవమానాలు ఎదుర్కొని  తెలంగాణ ఉద్యమం కొనసాగించామని, ప్రొఫెసర్ జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక ఎంతో మథనం ఉంది. గొర్రెల పెంపకం విషయంలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox