Breaking News

ఆసుపత్రి లోకి నీళ్లు వస్తే హంగామా చేస్తారా..ఫైర్ అవుతున్న తలసాని..!

16 th Jul 2020, UTC

             హైదరాబాద్ లో బుధవారం వర్షం బాగా ఎక్కువ గా కురవడం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. రోడ్లే కాదు.. ఉస్మానియా ఆసుపత్రి కూడా జలమయం అయ్యింది. ఆసుపత్రిలో రోగులు ఉన్న వార్డులో కూడా భారీ గా నీరు చేరి.. పేషంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఈ విషయమై ప్రతిపక్షాలు తమ స్థాయిలో విమర్శలు చేశాయి.. ప్రభుత్వ వైఫల్యాలే కారణం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై తలసాని ఫైర్ అయ్యారు.
 
             ఆస్పత్రిలోకి నీళ్ళు వచ్చినంత మాత్రాన హంగామా చేస్తారా? అంటూ ఆయన ప్రతిపక్షాలకు ఎదురు ప్రశ్న వేశారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాలు కూలితే దానికి బాద్యులెవరని మండిపడ్డారు. 2015లోనే ఉస్మానియాను ఆధునీకరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని  ఆయన చెప్పుకొచ్చారు.. నిరుపేదల కోసం.. 27ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రిని తిరిగి నిర్మించడానికి ప్రయత్నిస్తే.. అపుడు కూడా ఈ ప్రతిపక్షాలే ఆ ప్రయత్నానికి మోకాలడ్డి కోర్టుకు వెళ్లాయని తలసాని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి కోర్టుల మీద, చట్టం మీద గౌరవముందని...ఆయన చెప్పుకొచ్చారు. 
 
             ప్రజల ఆరోగ్యం పై ముఖ్యమంత్రి కి ప్రణాళిక ఉందని చెప్పుకొచ్చారు.. తెలంగాణ లో ఉన్నంత దరిద్రంగా ప్రతిపక్షాలు ఇంకెక్కడా లేవని తలసాని ఫైర్ అయ్యారు. సచివాలయం లో గుప్త నిధులు ఉన్నాయని విమర్శించడం హాస్యాస్పదం గా ఉందని అన్నారు. అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.. బీజేపీ నాయకులు కూడా ఢిల్లీ ఓ డ్రామా.. హైద్రాబాదు లో ఓ డ్రామా ఆడుతున్నారని చెప్పారు.  24గంటల కరెంట్ మరే రాష్ట్రంలో అమలు కావటంలేదని  తలసాని గుర్తు చేసారు. ఉస్మానియా ఆసుపత్రికి వరద రావటం ఇదే మొదటిసారని  తలసాని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ , వాటర్ వర్క్స్ ఉద్యోగులు కష్టపడి వరద నీటిని బయటకు పంపించారని తలసాని తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox