Breaking News

అఖిల ప్రియా ఏ1  కావడానికి కారణం ఆ ఫోన్ కాల్.. ?

12 th Jan 2021, UTC

బోయినపల్లి కిడ్నాపు వ్యవహారంలో భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఏ2 గా ఉన్న ఆమెను ఏ1  గా పోలీసులు నిర్ధారించారు. ఒక్క ఫోన్ కాల్ వల్ల ఈ కేసులో ఏ1గా భూమా అఖిల ప్రియను చేర్చినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు కేవలం అనుమానితులుగా అఖిల ప్రియా ఒక్క ఫోన్ కాల్ ను పోలీసులు గుర్తించడంతో ఆమెను ఏ1  కింద చేర్చారు. 

ఈ కిడ్నాప్ జరగడానికి ముందే నిందితులు ఆరు సిమ్ కార్డులను కొనుగోలు చేసారు. వీటికి ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలను ఇచ్చారు. ఎప్పుడైతే, ఈ వ్యవహారం మీడియా వరకు వచ్చి, పోలీసులు సోదాలు చేస్తుండడం తో కిడ్నపర్లు ముగ్గురు సోదరులని వదిలేయాలని భావించారు. ఈ క్రమంలోనే వారు అర్ధరాత్రి నార్త్ జోన్ డీసీపీకి కాల్ చేసారు. ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని మాట్లాడించారు. అంతకంటే ముందు, అదే ఫోన్ తో అఖిలప్రియకు కూడా కాల్ చేసారు. దీని ఆధారంగానే పోలీసులు ఈ కేసును ఛేదించారు.

అయితే ఈ ఫోన్ నెంబర్ అఖిల్ ప్రియా భర్త వద్ద పిఎ పని చేస్తున్న మల్లిఖార్జున్ దిగా పోలీసులు గుర్తించారు. మల్లికార్జున్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోన్ నుంచి మరికొందరికి కూడా కాల్స్ వెళ్లాయి. డ్రైవర్ బాల చెన్నయ్యకు, ఆళ్లగడ్డకు చెందిన సంపత్ తో సహా మొత్తం పందొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం అఖిల ప్రియా ఆధ్వర్యంలోనే జరిగిందని నిందితుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు వివరించారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox