Breaking News

నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్దిగా నోముల భగత్ కుమార్

29 th Mar 2021, UTC

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్దిగా సీఎం కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్ ను ఖరారు చేసారు. నోముల నర్సింహయ్య రాజకీయ వారసుడిగా భగత్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇంజీనీరింగ్, ఎంబీఏ చేసిన ఆయన సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్‌లో జూనియర్ ఇంజనీర్‌గా, అసిస్టెంట్‌గా పని చేశారు. విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా అనుభవం ఉంది. అనంతరం ఆయన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. 2014 నుంచి టీఆర్‌ఎస్‌లో చురుగ్గా పని చేస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో 2014 - 2018సాధారణ ఎన్నికలలో తండ్రికి చేదోడు వాదోడుగా బాధ్యతలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

గతంలో జరిగిన 2020 శాసనమండలి ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదులోనూ భగత్ చురుగ్గా ఉండేవారు. అంతేకాకుండా నోముల ఎన్.ఎల్. ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఫౌండేషన్ చైర్మన్‌గా ఉంటూ పేద విద్యార్థులకు ఉచిత విద్య, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. నిరుపేద గ్రామీణ విద్యార్థుల కోసం కోచింగ్ క్లాసులు, జాబ్ మేళాలు ఏర్పాటు చేయించారన్న పేరుంది.

కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డిబరిలోకి దిగారు. గత 2018 ఎన్నికల్లో జానా రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోసారి జానా రెడ్డి  పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా నివేదితా రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై  ఆసక్తి నెలకొంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox