Breaking News

మెదక్ జిల్లాలో ఎన్‌ఐఏ సోదాలు

23 rd Jun 2022, UTC
మెదక్ జిల్లాలో ఎన్‌ఐఏ సోదాలు

Medak: తెలంగాణలోని పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు ముమ్మరం చేసింది. నర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్‌ఐఏ అధికారులు.హైదరాబాద్‌లోని ఉప్పల్‌తో పాటు మెదక్ జిల్లాలో తనిఖీలు చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంటలో మావోయిస్టు అగ్రనేత దుబషి శంకర్ కుమారుడి దేవేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. దుబాషి శంకర్ సొంత గ్రామం దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి కావడం, ఆర్కేతో వ్యక్తిగత సంబంధాలు ఉండడంతో సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. దేవేందర్ ఇంట్లో గత ఏడాది నవంబర్‌లో సోదాలు జరిపిన ఎన్‌ఐఏ అధికారులు వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

  • Tags