Breaking News

ప్రియుడి మోజులో.. పిల్లలను చిత్రహింసలు పెట్టిన కన్నతల్లి..!

29 th Oct 2020, UTC

ఇటీవల.. ఆధునికత పెరిగిన కాలం లో... కడుపుకోతకి గురి చేసే వార్తలు ఎక్కువ వినాల్సి వస్తోంది.. అక్రమ సంబంధాలు హెచ్చు మీరుతున్నాయి..ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్న వారు కట్టుకున్న వారిని కడతేర్చుతున్న ఘటనలు కూడా ఈ మధ్య కాలం లో ఎక్కువ గా వెలుగులోకి వస్తున్నాయి.. ఇలాంటి ఘటనే ఇటీవల గుంటూరు లో చోటు చేసుకుంది.. ప్రియుని మోజులో పడి.. ఓ తల్లి కన్న బిడ్డలను చిత్ర హింసలకు గురి చేసింది. పదేళ్లలోపు వయస్సు ఉన్న కుమారుడు, కుమార్తెను  ఆమె దుర్మార్గం గా మేకులు ఉన్న కర్రతో కొట్టింది. దీనితో.. ఆ చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే.. స్థానికులు వార్డు సచివాలయ పోలీసులకు సమాచారం అందించడం తో.. మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాలలోకి వెళితే.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ మహిళకు వివాహం జరిగింది. ఆమె కు పదేళ్ల లోపు వయస్సు కలిగిన ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలం గా ఆమె భర్త నుంచి వేరుగా ఉంటోంది.. ఈ తరుణం లో ఆమె కు శీను అనే వ్యక్తి తో అక్రమ సంబంధం ఏర్పడింది. క్రమం తో అతనితో సహజీవనం చేయడం ప్రారంభించింది. అయితే.. ఆమెను ప్రియుడితో గడపనివ్వకుండా పిల్లలు అడ్డు వస్తున్నారన్న కారణం తో.. సొంత కుమారుడు, కుమార్తెపై ఆమె మేకుల కర్రతో  కొడుతూ హింసిస్తోంది. పిల్లలను కొట్టి ఇంటి నుంచి గెంటి వేయాలని ప్రయత్నించింది. అయితే.. అది గమించిన స్థానికులు.. సచివాలయం లోని మహిళా పోలీస్ అధికారిణి కి సమాచారం అందించారు. మహిళా పోలీస్ అక్కడకి చేరుకునే సరికి.. ఆ మహిళా పారి పోవడానికి ప్రయత్నించింది. అయితే.. మహిళా పోలీసులు ఆమె ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. 

మరో వైపు విశాఖ పట్టణం లో కన్న తల్లే కొడుకుని హత్య చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు చెడు వ్యసనాలకు భానిస కావడం.. ఎన్నిసార్లు చెప్పిచూసినా  మార్పు కనిపించకపోవడం తో.. ఆ తల్లి ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కొడుకు చేస్తున్న ఆగడాలను ఆ తల్లి సహించలేకపోయింది. రోజు బయట వ్యక్తులతో గొడవపడి.. ఇంట్లో తల్లి తండ్రులను కూడా కొడుతుండడం తో.. ఓపిక నశించిన తల్లి.. తన కొడుకుని హత్య చేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox