మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి మంత్రి మల్లారెడ్డి మామూళ్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేసిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది శామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలో 67 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసారు. దాంట్లో వాటా ఇవ్వాల్సిందేనంటూ మంత్రి మాట్లాడినట్టు ఆడియో టేపు ఇప్పుడు వైరల్‌గా మారింది.
వెంచర్ విషయంలో వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపాల్సిందే అంటూ మంత్రి ఆదేశించినట్లు ఆడియోలో వినిపిస్తోంది. సర్పంచ్‌లకు మాత్రమే వాటాలు ఇస్తే సరిపోతుందా? ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రులు ఉన్నారు. వీరికి ఇవ్వరా అంటూ అడిగారు. కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా అంటూ బెదిరించారు. అయితే, వెంచర్ వేస్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని, అతను ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడని అవతలి వ్యక్తి చెప్పగా అప్పటి వరకూ వెంచర్‌ను ఆపేయండి అంటూ వార్నింగ్ జారీ చేస్తున్నట్లు ఆడియో టేపులో ఉంది.
గతేడాది మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదయింది. కుత్బుల్లాపూర్ మండలం సురారంలో తన భూమిని కబ్జా చేయించారని శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి అనుచరులు తన స్థలంలో ప్రహరీగోడ నిర్మించారని, తన లాయర్ కూడా మంత్రితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వారు తప్పుడు అగ్రిమెంట్‌ను సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంత్రి దీన్ని ఖండించారు. మరిన్ని వార్తలు చదవండి

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021