Breaking News

డాక్టర్ శ్రీరామ్ కు మంత్రి హరీష్ రావు ప్రశంసలు..!

13 th Jul 2020, UTC

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనాతో వ్యక్తి మృతి చెందగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ట్రాక్టర్‌లో తరలించడానికి ప్రయత్నించారు. అయితే తాను ట్రాక్టర్‌ను నడపనని మున్సిపల్ డ్రైవర్ తెగేసి చెప్పేసి వాహనం వదిలివెళ్లిపోయాడు.

ట్రాక్టర్ నడిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడే ఉన్న సుల్తానాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీరామ్ పీపీఈ కిట్టు ధరించి ట్రాక్టర్ నడిపారు. మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లారు. కార్యక్రమాలు అన్నీ అయిపోయినంత వరకూ అక్కడే ఉన్న డాక్టర్ అనంతరం ఆస్పత్రికి వెళ్లారు.

మానవత్వం చాటుకున్న డాక్టర్ శ్రీరామ్‌పై స్థానికులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ప్రభుత్వం రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మరీ ముఖ్యంగా కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న దవాఖానాల్లో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని జనాలు కోరుతున్నారు

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా అభినందించారు. డాక్టర్ శ్రీరామ్‌.. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు. మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారు. కరోనాపై యుద్ధం చేస్తున్నఅందరికీ మీరు స్ఫూర్తి. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటు పడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox