Breaking News

నల్లా నీళ్ళలో మాంసపు ముద్దలు.. భయాందోళనలో గ్రామస్తులు

23 rd Jun 2022, UTC

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం గ్రామంలోని, మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ నల్లాల నుండి మాంసపు ముద్దలు ప్రత్యక్షమైయ్యాయి. నీళ్లు పట్టుకునేందుకు నల్లా తిప్పిన ప్రజలకు నీటితో పాటు మాంసం ముక్కలు వస్తుండటంతో అవాక్కయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక, భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామంలోని వాటర్ ట్యాంకుపై మూత లేదని గ్రామస్తులు తెలిపారు. 

మూత లేకపోవడంతో జంతువు పడి మృతి చెందిందా లేదా మరేదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. వాటర్ ట్యాంకుకు మూత లేకపోయినా స్థానిక అధికారులు, పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా వాటర్ ట్యాంకర్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox