Breaking News

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పోరేటర్ల ధర్నా సిగ్గు లేదా అని ప్రశ్నించిన మేయర్ విజయలక్ష్మి

23 rd Nov 2021, UTC

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  ప్రధాన కార్యాలయం వద్ద  బీజేపీ కార్పోరేటర్లు మంగళవారం మెరుపు ధర్నాకు దిగారు. మేయర్ ఛాంబర్‌లో భైఠాయించి ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు టేబుల్ విరగొట్టారు.  పూలకుండీలు పగలగొట్టారు.వారంతా ఛాంబర్‌లోకి దూసుకెళ్లినా పోలీసులు అడ్డుకోలేకపోయారు. గ్రేటర్ కార్యాలయం అంతా పూల కుండీల మట్టితో నిండిపోయింది. మేయర్ ఛాంబర్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. బల్దియా ఆఫీస్‌లో మేయర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోస్టర్లు అంటించారు. జీహెచ్ఎంసీ బోర్డుపై బ్లాక్ స్ప్రే కొట్టి నిరసన తెలిపారు.

జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగినట్లు  బిజెపి కార్పోరేటర్లు తెలిపారు. ఐదు నెలల క్రితం కరోనా కారణంగా పర్చువల్ గా నామమాత్రంగా మీటింగ్ జరిగిందని... ఆ మీటింగ్ లో చర్చించి ఒక్క సమస్యకూడా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని తాము కోరుతుంటే ఎక్కడ తమ అవకతవకలు బయటపడతాయోనని భయపడే మేయర్, టీఆర్ఎస్ కార్పోరేటర్లు వెనకడుగు వేస్తున్నారని బిజెపి కార్పోరేటర్లు ఆరోపించారు.

 సిగ్గు, శరం లేదా?

జీహెచ్ఎంసీ ఆఫీస్‌పై బీజేపీ దాడి ఘటనపై నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి   మండిపడ్డారు. మీకు మీ అధిష్టానం చెప్పినా.. ఇలాంటిది చేయడానికి మీకు సిగ్గు, శరం లేదా?" అని బీజేపీ నాయకులను మేయర్ నిలదీశారు. జీహెచ్ఎంసీ ఆఫీస్‌పై బీజేపీ శ్రేణుల దాడిని ఖండించారు. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేసింది పబ్లిక్ ప్రాపర్టీ కాదా అని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ మేయర్‌లా కాకుండా కార్పొరేటర్లు అందరిని కలుపుకొని వెళ్తున్నానని ఆమె పేర్కొన్నారు. మీకు మీరే చేసారా లేక మీ అధిష్టానం ఆదేశాలతో బల్దియా ఆఫీస్‌పై దాడి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాల టైంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రాంతాల్లో కూడా తాము పర్యటించామన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox