Breaking News

సీఎం కేసీఆర్ కు కరోనా".. తప్పుడు వార్తపై కేసు నమోదు..!

06 th Jul 2020, UTC
సీఎం కేసీఆర్ కు కరోనా
                  ఇటీవల.. సీఎం కెసిఆర్ కు కరోనా సోకిందంటూ.. ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేసింది. అయితే.. ఆ వార్తా నిజమేనేమో అనుకుని కొందరు కంగారు పడ్డారు కూడా.. కానీ అది ఒక ఫేక్ న్యూస్. సీఎం కేసీఆర్ కు కరోనా అంటూ తప్పుడు వార్తలు రాసిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరి ఆనం చిన్ని వెంకటేశ్వర రావుతో పాటు పత్రిక యాజమాన్యంపై  కూడా కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసారు.
 
                   పోలీసుల వివరాల ప్రకారం... ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ పేపర్ లో రెండు రోజుల క్రితం "సీఎం కేసీఆర్ కి కరోనా" ."హరితహారం కార్యక్రమంలో సోకిందా"  అంటూ ఓ వార్త ప్రచురితం అయింది. ఈ వార్తను... రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న మహ్మద్ ఇలియాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త చూశాడు. సీఎం కెసిఆర్ కూడా.. జలుబు వంటి లక్షణాలతో ఇబ్బందులతో ఉన్నారని.. ప్రస్తుతం క్వారంటైన్ లో చికిత్స  తీసుకుంటున్నారని.. ఈ వార్త సారాంశం.. ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా అంటూ వార్త రాయడంతో షాక్ కి గురైన ఇలియాస్ తన స్నేహితులకు ఈ వార్తను చూపించి విషయం ఆరా తీశారు. 
 
                   అయితే.. ఈ వార్తను అధికారులు ధృవీకరించలేదని.. తప్పుడు వార్త అయి ఉంటుందని ఖరారు చేసుకున్నారు. దీనితో.. ఆదివారం సాయంత్రం.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన కలిగించే కుట్రకు పాల్పడిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఇలియాస్ పోలీసులను కోరారు. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి వెంకటేశ్వరరావుతో పాటు యాజమాన్యంపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox