Breaking News

మూసీనదిని చూసి మురుగు కాలువ అనుకున్నాను.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ

22 nd Nov 2021, UTC

పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించారని హైకోర్టు  చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ  పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్ విహార్ లో  రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీ  నూతన కార్యాలయాన్ని ఆయన చైర్మన్ జస్టిస్ ప్రకాష్ రావు తో కలిసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  జస్టిస్ సతీష్ చంద్ర  సభను  ఉద్దేశించి మాట్లాడారు.

నేను  మధ్యప్రదేశ్ లో  లో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ గురించి ఎంతో గొప్పగా విన్నాను. మొదటిసారి హైదరాబాదు వచ్చినప్పుడు  హుస్సేన్ సాగర్ ని చూడడానికి వెళ్లాను. అయితే అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా.. అలాగే హైకోర్టు దగ్గర ఉన్న మూసీనదిని చూసి మొదట మురుగునీటి కాలువ అని అనుకున్నాను. కానీ, నా డ్రైవర్ అది మాసీనది అని చెప్పడంతో ఆశ్చర్యపోయానిని  సతీష్ చంద్ర  అన్నారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీకి ఐదుసార్లు క్లీన్ సిటీ అవార్డు వచ్చిందని,  అక్కడి కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు మరుగుదొడ్ల పక్కనే ఫుట్ పాత్ పై  భోజనం చేశారని ఆయన అన్నారు.  నదులు, సరస్సులు, పరిసరప్రాంతాలను  కలుషితం చేస్తున్న వారిపై ఈ తో పాటు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఉండి.. కాలుష్య నియంత్రణకు  పాటుపడాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అథారిటీ మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox