Breaking News

Laldarwaja Bonalu: లాల్‌దర్వాజ బోనాలు.. అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

01 st Aug 2021, UTC

Hyderabad :హైద్రాబాద్ నగరంలో ఆషాడం బోనాల ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో సింహవాహిని అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. బోనాలు తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.భాగ్యలక్ష్మి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పట్టు వస్త్రాలను సమర్పించారు. 

అమ్మవారి ఊరేగింపును పురస్కరించుకొని పాతబస్తీలో ట్రాఫిక్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. లాల్‌దర్వాజ బోనాలతో హైద్రాబాద్ లో ఆషాడ బోసాల సందడి ముగియనుంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox