Breaking News

నటి మీరా విజ్ఞప్తి స్పందించిన కేటీర్..కృతజ్ఞతలు చెప్పిన మీరా..!

05 th Jun 2020, UTC
నటి మీరా విజ్ఞప్తి స్పందించిన కేటీర్..కృతజ్ఞతలు చెప్పిన మీరా..!
హీరో ఎన్టీఆర్ అభిమానులు తనని దారుణ గా వేధిస్తున్నారంటూ.. నటి మీరా చోప్రా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా, బెదిరింపులు వస్తుండడం తో.. ఆమె తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేశారు. సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని, యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని, ఇంకా అనేక రకాలుగా దూషిస్తున్నారని  ఆమె ఈ విషయాన్నీ కేటీర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ట్వీట్ కి కేటీర్ స్పందించారు. ఆయన ఈ సందర్భం గా మరో ట్వీట్ పోస్ట్ చేసారు, ""మేడమ్, ఈ విషయాన్ని పరిశీలించాలని నేను తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను కోరాను. మీ ఫిర్యాదుపై చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించాను"  అని కేటీర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
            దీనిపై మీరా చోప్రా ట్విటర్ లో కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది. "థాంక్స్ సర్... మీ మేలు మర్చిపోలేను. మహిళల భద్రతకు ఇది ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. ఇలాంటి వాళ్లను స్వేచ్ఛగా వదలకూడదు, లేకుంటే మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయి" అని మీరా చెప్పుకొచ్చింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox