Breaking News

గ్రాడ్యుయేట్ ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న కేటీఆర్

01 st Oct 2020, UTC

హైదరాబాద్:హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్టులో తన పేరును మంత్రి కేటీఆర్ నమోదు చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా నేడు ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మంత్రికి అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని, ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు అంతా తమ పేరుని ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్ట్ తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. 2017 నవంబర్ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ ఓటర్ లిస్టులో తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులేనని, కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox