Breaking News

కెసిఆర్ పై వస్తున్న విమర్సలపై స్పందించిన కేటీర్..!

13 th Jul 2020, UTC

తెలంగాణ రాష్ట్రము లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. రోజు రోజు కు కేసులు పెరుగుతున్న నేపధ్యం లో.. తెలంగాణ లో అటు అధికారుల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతోంది.. కరోనా కేసుల ను అరికట్టే  దిశ గా కెసిఆర్ చర్యలు చేప్పట్టడం లేదనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.. మరో వైపు.. తెలంగాణ లో పరీక్షలు కూడా తక్కువ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపధ్యం లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీర్ స్పందించారు.
 
         కరోనా మహమ్మారి సమస్య ఇపుడిపుడే వదిలి పోయేది కాదని కెసిఆర్ అన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని, కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు అర్థరహితమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కరోనా విషయంలో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉందని... అలాంటప్పుడు ఈ విషయంలో ప్రధాని మోదీ కరోనా కట్టడిలో ఫెయిలయ్యారని అనుకోవాలా ? అంటూ ఆయన తిరుగు ప్రశ్న వేశారు. ఈ కష్టకాలం లో ఒకరినొకరు విమర్శించుకోవడం తగదని అన్నారు. 
 
          ఈ కరోనా గడ్డుకాలం లో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఎంతో గొప్ప గా  పని చేస్తున్నారని ప్రశంసించారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే అద్భుతంగా పని చేస్తున్నాయని కేటీర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు ఈటల, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. కరోనా తో ప్రస్తుతం రాష్ట్రము కష్టకాలం లో ఉందని.. ఈ సమయం లో వైద్యుల ఆత్మస్థయిర్యం దెబ్బతినేలా వ్యవహరించొద్దని కేటీర్ మీడియా కు సూచించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox