Breaking News

కేసీఆర్ కు 60 మంది ఎమ్మల్యే అభ్యర్దులు కూడ దొరకరు.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్

27 th Nov 2021, UTC

తెలంగాణలో  కాంగ్రెస్, తెరాస నుంచి 25 మంది నేతలు టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి  తరుణ్ చుగ్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే, తమ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయమన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని, చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదన్నారు. 

తరుణ్ చుగ్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదీ ముగిసిన అధ్యాయమన్నారు.

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కనీసం 60 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు దొరకరని అన్నారు.ఇటీవల ఢిల్లీ పర్యటనలో కె. చంద్రశేఖర్‌రావు కు షాక్ తగిలిందని తరుణ్ చుగ్ అన్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox