Breaking News

ఎమ్మెల్సీ బరిలో కొత్త పేర్లు..మరి మేయర్ సంగతేంటో..?

23 rd Sep 2020, UTC

హైదరాబాద్ :తెలంగాణలో ఎమ్మెల్సీ రేసు షురూ అయింది. ఇప్పటికే ఈ పదవికి మేయర్ బొంతు రామ్మోహన్ ను ఎన్నుకునే అవకాశం ఉందని పలు వార్తలు హల్ చల్ చేశాయి. కానీ తాజాగా ఈ పదవి కోసం కొత్త అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ల పేర్లు కనిపిస్తున్నాయి. దీనితో ఇప్పటి వరకు ఆశలు పెట్టుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ సంగతేంటో అన్న చర్చ మొదలైంది. 

మరో వైపు ఎమ్మెల్సీ పదవి కోసం రోజుకో పేరు, గంటకో సమీకరణం బయటకొస్తుండడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందోనన్న గందరగోళం నెలకొంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజ శేఖర్  పోటీ చేసి రేవంత్ రెడ్డి పై ఓడిపోయారు. ప్రస్తుతం ఈ పేరు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ లో కనిపిస్తోంది. హైదరాబాద్-మహబూబ్ నగర్ -రంగారెడ్డి ఎమ్మెల్సీ పొజిషన్ కి గాను ఈయన బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. 

మర్రి రాజ శేఖర్  మంత్రి మల్లారెడ్డికి అల్లుడు ఈయనకు చాలా విద్యాసంస్థలు ఉన్నాయి. ఈయన పేరుతో పాటు మరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం ఓ కార్యాలయంలో కేసీఆర్ ఓఎస్డిగా కొనసాగుతున్న దేశపతిని కూడా ఎమ్మెల్సీ బరిలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్  కోటలో ఎమ్మెల్సీ స్థానం కోసం దేశపతి కూడా కృషి చేస్తున్నారని తెలుస్తోంది. కళాకారుడి రిజర్వేషన్  కింద గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఖరారైపోయింది.. దీనితో.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరి లోకి దేశపతి ని పంపాలని తెరాస ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే స్థానం లో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నుకోబడ్డారు. అయితే ఈసారి కూడా ఆయననే ఎంచుకోవాలని భావించినప్పటికీ ఆయన  టీఆర్ఎస్ తరపున పోటీ చేయనని చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యం లో ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఎవరిని వరిస్తాయో అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox