Breaking News

జిహెచ్ఎం సికి కేసీఆర్ ఐదుకోట్ల తక్షణ సాయం..!

15 th Oct 2020, UTC

హైదరాబాద్ :భారీ వర్షాల కారణం తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసారు. ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వం తరపున వెంటనే అందించాలని కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ నగర పరిధిలో ఈ సహాయక కార్యక్రమాలను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసారు. ఇందుకోసం ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేసారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కోసం మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నాళాలపై కట్టిన ఇళ్ళు కూడా కూలిపోయాయని వాటి స్థానంలో ప్రభుత్వం కొత్త ఇళ్ళు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. నీళ్లుండగానే విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదమని, ఒకటి రెండు రోజులు ఇబ్బందులు పడినప్పటికీ, నీటిని మొత్తం తొలగించిన తరువాతే విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox