మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ బి-ఫామ్ ను అందచేశారు. హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆమెను తెరాస తరపున అభ్యర్థిగా ఎంపిక చేసారు. తాజాగా, ఈరోజు సీఎం కేసీఆర్ బి-ఫామ్ ను అందచేశారు.
నేడు సీఎం కేసీఆర్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నేతలతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సమావేశం పూర్తి అయిన తరువాత వాణీదేవికి కేసీఆర్ బి ఫామ్ ను అందచేయడం జరిగింది. ఈ సమావేశం లో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కెసిఆర్ వారితో చర్చలు జరిపి మార్గనిర్దేశం చేసారు.
ఈ సమావేశం పూర్తి అయ్యాక వాణీదేవితో సహా పలువురు నేతలు గన్ పార్క్ కు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి ఆ తరువాత నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానానికి గాను ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని తీసుకోవాలని తెరాస పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. మరిన్ని వార్తలు చదవండి

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
25 Feb 2021
25 Feb 2021