Kaleshwaram Commission Serious on Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం సీరియస్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణలో భాగంగా కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ మరోమారు లేఖ రాసింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు పర్యాయాలు కమిషన్ లేఖ రాసింది. అయితే ఆ వివరాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు అడగాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ విచారణ అనంతరం మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది.
అయితే మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ను కాళేశ్వరం కమిషన్ కు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. అయితే కాళేశ్వరం కమిషన్ అడుగుతున్న కేబినెట్ మినిట్స్ ను ప్రభుత్వం అప్పగిస్తే పలు కీలక అంశాలపై సమాచారం లభించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.