Breaking News

జర్నలిస్ట్ మనోజ్ కు సరైన వైద్యం జరగలేదు..: మనోజ్ సోదరుడు

09 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని రోజురోజు కు పెంచుకుంటూ పోతోందే తప్ప ఈ ఉధృతి ని అదుపుచేయడం ఎవరి వల్ల కావడం లేదు. హైద్రాబాదు లో టీవీ 5 ఛానల్ జర్నలిస్ట్ మనోజ్ కరోనా సోకి చనిపోయిన సంగతి తెలిసిందే. వార్తలు అందించే జర్నలిస్టులపై ప్రభుత్వం చిన్న చూపే చూస్తుంది. పోలీసుల్లానే..వీరు కూడా ప్రాణాలకు తెగించి వార్తల కవరేజి కోసం పని చేస్తారు. వైద్యులకు, పోలీసులకి అందే సాయం కూడా వీరికి కనీసం అందదు. నగరం లో ఓ జర్నలిస్ట్ కరోనా తో మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే... అసలు మనోజ్ కి సరైన వైద్యమే అందలేదని అతని సోదరుడు సాయికుమార్ ఆరోపిస్తున్నాడు.
 
              మనోజ్ మృతి పై అతని సోదరుడు సాయి కుమార్ స్పందించాడు. అసలు ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవని.. ఐసీయూలో బెడ్స్ లేవని వార్డుల్లో ఆక్సిజన్ సిలెండర్లు లేవని  అక్కడి ఆసుపత్రి సిబ్బంది చెప్పారంటూ సాయి కుమార్ మండిపడ్డారు. మనోజ్ కు సరైన సమయం లో చికిత్స అందలేదని సాయి కుమార్ చెప్పాడు. అసలు ఆసుపత్రి లో సామాన్యులని పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
             మరో వైపు... చనిపోయే ముందు మనోజ్ తన సన్నిహితులతో చాట్ చేసారు. ఈ చాటింగ్ కూడా ప్రస్తుతం హాట్  టాపిక్ అయింది. గాంధీ ఆసుపత్రి లో ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన తన సన్నిహితులతో తన ఆవేదనను పంచుకున్నారు. ఐసీయూలో పరిస్థితులు కూడా సరిగా లేవన్నారు. గాంధీ ఆస్పత్రిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ కొన్ని విజువల్స్ కూడా పంపించారు.గాంధీ ఆసుపత్రి లో ఆక్సిజన్ పెట్టడం లేదని.. తనని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించాలని కూడా ఆయన కోరారు. కానీ అంతలోనే.. ఆయన లోకాలు వీడారు. దీనితో.. ఆసుపత్రుల్లో అసలు సరైన సౌకర్యాలు కూడా లేవనే విమర్శలు వస్తున్నాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox