Breaking News

దేశభక్తిపై సర్టిఫికెట్ ఇచ్చేది ఈ మూర్ఖులా? కేటీఆర్

23 rd Nov 2021, UTC

ముఖ్యమంత్రి కేసీఆర్‌  పై తెలంగాణ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  మండిపడ్డారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా చేసిన పోరాటంలో చ‌నిపోయిన 750 మంది రైతు కుటుంబాల‌కు ఆర్థిక‌ సాయం చేస్తాన‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నేతలు  చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వారి వ్యాఖ్యలను తప్పుబట్టిన కేటీఆర్.. దేశభక్తిపై ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు ఈ మూర్ఖులెవరంటూ బీజపీ నేతలను ప్రశ్నించారు. 

కొవిడ్‌ సమయంలో, చలిలో ఏడాదిగా రైతులను వీధిపాలు చేసినవారు దేశభక్తులా అని ప్రశ్నించారు. అదే రైతులను ఆదుకున్నవారు దేశ ద్రోహలవుతారా..? అంటూ ఫైర్ అయ్యారు. దేశ భక్తిపై ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు..? అని  కేటీఆర్ ట్వీట్ చేశారు.సాగు చట్టాలపై పోరులో వందలాది మంతి రైతులు ఆత్మార్పణం చేశారని.. ఒత్తిడికి లోనై, ఆరోగ్యం బాగాలేక ప్రాణాలు వదిలారని.. భారతప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేసీఆర్ కోరారు. తు ఉద్యమం వల్ల మరణించిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం.. రూ..22.5 కోట్లు దానికి ఖ‌ర్చు అవుతాయని చెప్పారు.

కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ బీజేపీ నేతలు  విమర్శలు గుప్పించారు. పంజాబ్ రైతలకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్ తెలంగాణ రైతులను ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox